Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 59

Story of Trisanku - 2 !!

|| om tat sat ||

బాలకాండ
ఏబది తొమ్మిదవ సర్గము

ఉక్త వాక్యం తు రాజానం కృపయా కుశికాత్మజ |
అబ్రవీన్మధురం వాక్యం సాక్షాత్ చండాలరూపిణమ్ ||

స|| కుశికాత్మజః చండాలరూపిణం రాజానం ఉక్త వాక్యం ( శ్రుత్వా) కృపయా మధురం వాక్యం అబ్రవీత్|

తా|| చండాలరూపములోగల ఆ రాజుయొక్క మాటలను విని కరుణతో మథురమైన వాక్యములతో ఇట్లు చెప్పెను

ఇక్ష్వాక స్వాగతం వత్స జానామి త్వాం సుధార్మికమ్ |
శరణం తే భవిష్యామి మాభైషీః నృప పుంగవః||

స|| " హే ఇక్ష్వాక ! వత్స స్వాగతం | మాభైషీః | త్వాం సుధార్మికం జానామి | హే నృపపుంగవ ! శరణం తే భవిష్యామి | "

తా|| ఓ ఇక్ష్వాకా ! వత్సా స్వాగతము. భయపడకుము| నీ ధార్మికత్వము నాకు తెలుసు. ఓ నృపపుంగవ నీకు శరణు ఇచ్చుచున్నాను |

అహమామంత్రయే సర్వాన్ మహర్షీన్ పుణ్యకర్మణః |
యజ్ఞసాహ్యకరాన్ రాజన్ తతో యక్ష్యసి నిర్వృతః ||

స|| హే రాజన్ ! అహం యజ్ఞసాహ్యాకరన్ పుణ్యకర్మణః సర్వాన్ మహర్షీన్ ఆమంత్రయే ! తతః నిర్వృతః యక్ష్యసి |

తా|| ఓ రాజన్ ! యజ్ఞమున సహాయపడు పుణ్యాత్ములైన మహర్షులనందరినీ ఆహ్వానింతును. అప్పుడు నీవు నిశ్చింతగా యజ్ఞము చేయుము.

గురుశాపకృతం రూపం యదిదం త్వయి వర్తతే|
అనేన సహ రూపేణ సశరీరో గమిష్యసి ||

స|| యత్ ఇదం గురుశాపకృతం రూపం త్వయి వర్తతే అనేన రూపేణ సహ స శరీరో గమిష్యసి ||

తా|| నీకు గురుశాపమువలన కలిగిన చండాలరూపము ఇట్లేయున్నచే అటులనే శరీరముతో సహా ( స్వర్గమునకు) వెళ్ళెదవు.

హస్త ప్రాప్తమహం మన్యే స్వర్గం తవ నరాధిప |
యస్త్వం కౌశికమాగమ్య శరణ్యం శరణాగతః||

స|| యదా కౌశికం శరణ్యం త్వం శరణాగతః ఆగమ్య అహం మన్యే తవ స్వర్గం హస్తః ప్రాప్తః ||

తా|| నీవు శరణు ఇవ్వగల కౌశికుని శరణులోకి వచ్చితివి కనుక నేను నీకు సర్గము హస్తగతము అయినట్లే భావింతును.

ఏవముక్త్వా మహాతేజాః పుత్త్రాన్ పరమధార్మికాన్ |
వ్యాదిదేశ మహాప్రాజ్ఞాన్ యజ్ఞసంభార కారణాత్ ||

స|| మహతేజాః ఏవం ఉక్త్వా పరమధార్మికాన్ మహాప్రాజ్ఞాన్ పుత్త్రాన్ యజ్ఞసంభారకారణాత్ వ్యాదిదేశ ||

తా|| ఆ మహాతేజోవంతుడు ఇట్లు పలికి పరమ ధార్మికులూ ప్రజ్ఞావంతులూ అయిన తన పుత్రులకి యజ్ఞము నకు కావలసిన సంభారములను సమకూర్చుటకు ఆదేశము ఇచ్చెను.

సర్వాన్ శిష్యాన్ సమాహూయ వాక్య మేతదువాచ హ |
సర్వాన్ ఋషిగణాన్ వత్సా అనయ్ధ్వం మమాజ్ఞయా ||
సశిష్య సుహృదశ్చైవ సర్త్విజస్సబహుశ్రుతాన్ |

స|| సర్వాన్ శిష్యాన్ సమాహూయ ఏతద్ వాక్యం ఉవాచ హ |"వత్సా ! సర్వాన్ ఋషిగణాన్ స శిష్య సుహృదశ్చైవ స ఋత్విజ స బహుశ్రుతాన్ మమ ఆజ్ఞయా ఆనయధ్వమ్ ||

తా|| తన శిష్యులను అందరినీ పిలిచి ఇట్లు చెప్పెను. "వత్సా ! ఋషిగణములను అందరినీ శిష్యులతో , మిత్రులతో, ఋత్విజులతో , అన్నీ తెలిసిన పండితులతో నా ఆజ్ఞ గా తీసుకు రండు".

యదన్యో వచనం బ్రూయాత్ మద్వాక్యబలచోదితః ||
తత్సర్వమఖిలేనోక్తం మమాఖ్యేయమనాదృతమ్ ||

స|| యది అన్యో వచనం బ్రూయాత్ మద్వాక్య బలచోదితః తత్ సర్వం అనాదృతం మమాఖ్యే ||

తా||" ఏవరైన నా మాటలు అనుసరించక ఇతర మాటలను చెప్పినచో అది అంతయూ నాకు తెల్పుడు" అని.

తస్య తద్వచనం శ్రుత్వా దిశో జగ్ముః తదాజ్ఞయా |
అజగ్నురథ దేశేభ్యో సర్వేభ్యో బ్రహ్మవాదినః ||

స|| తస్య తత్ వచనం శ్రుత్వా తత్ ఆజ్ఞయా దిశో జగ్ముః | అథ దేశేభ్యో సర్వేభ్యో బ్రహ్మవాదినః అజగ్ముః||

తా|| అయన యొక్క ఆ మాటలను విని ( ఆ శిష్యులు ) ఆ ఆజ్ఞతో అన్ని దిశలలో పోయిరి. పిమ్మట దేశ దేశములనుంచి బ్రహ్మవాదులు అందరు వచ్చిరి.

తే చ శిష్యాస్సమాగమ్య మునిం జ్వలితతేజసమ్ |
ఊచుశ్చ వచనం సర్వే సర్వేషాం బ్రహ్మవాదినామ్ ||

స|| తే శిష్యాః సమాగమ్య జ్వలిత తేజసం మునిం సర్వే సర్వేషాంబ్రహ్మవాదినాం వచనం ఊచుః చ ||

తా|| ఆయన శిష్యులు అందరూ తేజముతో వర్ధిల్లుచున్న ఆ మునివద్దకు వచ్చి బ్రహ్మవేత్తలు పలికిన మాటలు ఆయనకు వినిపించిరి.

శ్రుత్వా తే వచనం సర్వే సమాయాంతి ద్విజాతయః |
సర్వదేశేషు చాగచ్ఛన్ వర్జయిత్వా మహోదయమ్ ||

స|| "తే వచనం శ్రుత్వా సర్వ దేశేషు సర్వే ద్విజాతయః సమాయాంతి మహోదయం వర్జయిత్వా ఆగచ్ఛన్ ||

తా|| "మీ మాటలను అనుసరించి దేశ దేశములనుండి బ్రాహ్మణులందరు వచ్చుచున్నారు , మహోదయుడు తప్ప".

వాశిష్ఠం తచ్చతం సర్వం క్రోథ పర్యాకులేక్షణః |
యదాహ వచనం సర్వం శ్రుణు త్వం మునిపుంగవ ||

స|| హే మునిపుంగవ ! తత్ శతం వాసిష్ఠంక్రోథ పర్యాకులేక్షణః యత్ ఆహ తత్ సర్వం త్వం శ్రుణు ||

తా|| ఓ మునిపుంగవ ! ఆ వందమంది వసిష్ఠుని పుత్రులు ఏమని చెప్పితిరో అది సర్వము నీవు వినుము.

క్షత్రియో యాజకోయస్య చ్చండాలస్య విశేషతః |
కథం సదసి భోక్తారో హవిస్తస్య సురర్షయః ||

స|| అస్య విశేషతః చండాలస్య యాజకః క్షత్రియః | సదసి సురః ఋషయః కథం భోక్తారో ( ఇతి) ||

తా || చండాలునియొక్క యాజ్ఞము క్షత్రియునిచే చేయబడుచున్నది. ఆ సదస్సులో దేవతలూ ఋషులు ఏట్లు భుజించెదరు ?

బ్రాహ్మణా వా మహాత్మానో భుక్త్వా చండాలభోజనమ్ |
కథం స్వర్గం గమిష్యంతి విశ్వామిత్రేణ పాలితా ||

స||విశ్వామిత్రేణ పాలితా బ్రాహ్మణా వా మహాత్మానో చండాల భోజనం భుక్త్వా కథం స్వర్గం గమిష్యంతి ( ఇతి)

తా|| విశ్వామిత్రునిచే పాలింపబడి ఆ చండాలుని భోజనము తిని బ్రాహ్మణులైననూ మహాత్ములే అయిననూ స్వర్గము ఏట్లు చేరెదరు?

ఏతద్వచన నైష్ఠుర్యమ్ ఊచుః సంరక్త లోచనః |
వాసిష్ఠా మునిశార్దూల సర్వే తే సమహోదయాః ||

స|| హే మునిశార్దూల ! సర్వే తే మహోదయాః వాసిష్ఠా సంరక్త లోచనః ఏతత్ నైష్ఠూర్యం వచనం ఊచుః ||

త|| "ఓ ముని శార్దూల ! మహోదయుడూ వసిష్ఠుని పుత్రులందరూ క్రోధముతో ఈ విథముగా ఎర్రపడిన కన్నులతో నిష్టూరముగా మాట్లాడిరి".

తేషాం తద్వచనం శ్రుత్వా సర్వేషాం మునిపుంగవః |
క్రోధసంయుక్త నయనః సరోషం ఇదమబ్రవీత్ ||

స|| తేషాం సర్వేషాం తత్ వచనం శ్రుత్వా క్రోధ సంయుక్త నయనః స రోషం ఇదం అబ్రవీత్ ||

తా|| 'వారందరియొక్క ఆ మాటలను విని క్రోధముతో నిండిన కన్నులు గలవాడై ఇట్లు పలికెను':

యే దూషయంత్యదుష్ఠం మాం తపౌగ్రం సమాస్థితమ్ |
భస్మీ భూతా దురాత్మానో భవిష్యంతి న సంశయః ||

స|| అదుష్టం తప ఉగ్రం సమాస్థితం మాం యే దూషయంత్యః | భస్మీ భూతా భవిష్యంతి న సంశయః ఇతి ||

తా|| "తీవ్రముగా తపమోనర్చుచూ, పవిత్రముగా నున్న నన్ను దూషించుచున్నారు. వీరు భస్మము అయిపోయెదరు. సందేహము లేదు" అని.

అద్య తే కాలపాశేన నీతా వైవస్వతక్షయమ్ |
సప్తజాతిశతాన్యేవ మృతపాస్సంతు సర్వశః ||

స|| అద్య తే కాలపాశేన నీతా వైవస్వత క్షయమ్ | జాతి సర్వశః సప్త శతాని ఏవ మృతపాః సంతు |

తా|| "నేడే వారు యమపాశముతో నరకమునకు లాగబడుదురు. వీరందరూ ఏడు వందల సంవత్సరములు మృత బక్షకులుగా నుందురు".

శ్వమాంస నియతాహారా ముష్టికా నామ నిర్ఘృణాః|
వికృతాశ్చ విరూపాశ్చ లోకాననుచరంత్విమాన్ ||

స|| (తే) స్వమాంస నియత ఆహారా ( భవంతి) | ఇమాన్ వికృతాః చ విరూపాః చ ముష్టికా నామ నిర్ఘృణాః లోకాన్ అనుచర్వంతి |

తా|| "వారు శవములను భక్షించుచూ ఉండెదరు. వీరు వికృతరూపులై ముష్టికా అనబడు చూ లోకమున సంచరించెదరు".

మహోదయస్తు దుర్బుద్ధిః మమదుష్యం హ్యదూషయత్ |
దూషితాస్సర్వలోకేషు నిషాదత్వం గమిష్యసి ||

స|| దుర్బుద్ధిః మహోదయః మమ దుష్యం హ్య అదూషయత్ | సర్వలోకేషు దూషితాః నిషాదత్వం గమిష్యసి ||

తా|| "దుర్బుద్ధిగల మహోదయుడు నన్ను దూషించెను . అతడు అన్ని లోకములలో దూషించ బడు కిరాతకుని వలె వుండును".

ప్రాణాతిపాత నిరతో నరను క్రోశతాం గతః |
దీర్ఘకాలం మమ క్రోధాత్ దుర్గతిం వర్తయిష్యతి||

స|| దీర్ఘకాలం మమ క్రోధాత్ ప్రాణాతిపాత నిరతో నిరనుక్రోశతాం గతః దుర్గతిం వర్త ఇష్యతి ||

తా|| "చాలాకాలము నా శాపము వలన ప్రాణులను హింసించుచూ కఠినాత్ముడై దుర్గతులు పొందును".

ఏతావదుక్త్వా వచనం విశ్వామిత్రో మహతపాః |
విరరామ మహాతేజా ఋషిమధ్యే మహామునిః ||

స|| ఏతావత్ వచనం ఋషిమధ్యే ఉక్త్వా మహామునిః విశ్వామిత్రః మహాతపాః విరరామ ||

తా|| 'ఇట్టి వచనములను ఆ ఋషులమధ్యలో చెప్పి మహాముని అయిన విశ్వామిత్రుడు మిన్నకుండెను'.

|| ఇత్వార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ఏకోనషష్టితమస్సర్గః||

||ఓమ్ తత్ సత్ ||